- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులపై భారం మోపాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులపై భారం మోపాయి. వరుసగా రెండోరోజు బంగారం ధర పెరగ్గా.. వెండి కూడా పసిడికి పోటీగా పరుగు పెట్టింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.1,44,220కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.1,32,200కి చేరింది. బంగారం మాదిరిగానే వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ.5000 పెరగగా.. ప్రస్తుత ధర రూ.2,40,000గా ఉంది. పెరిగిన ధరలపై జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో మార్పులుండే అవకాశం ఉంది. ఆషాఢం, పైగా శూన్య మాసం కావడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా లేకపోయినా.. బంగారంపై పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా దానికి డిమాండ్ పెరుగుతోందని, ఫలితంగా ధర కూడా మారుతుందని నిపుణులు చెప్తున్నారు.






