బాలీవుడ్‌లో అన్నీ పనికిరాని రోల్స్ ఇస్తారు.. కాజల్ సంచలన కామెంట్స్!

by Mallepaka Hamsa |

నికిరాని రోల్స్‌కు బదులు మంచి నాణ్యత ఉన్న చిత్రాలకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. నటనను ప్రేమించి చేయడానికి భాష ఎప్పుడూ తనకు అడ్డంకి కాలేదని ఆమె స్పష్టం చేశారు.

బాలీవుడ్‌లో అన్నీ పనికిరాని రోల్స్ ఇస్తారు.. కాజల్ సంచలన కామెంట్స్!
X

దిశ, సినిమా: తెలుగు, హిందీ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెకండ్స్ ఇన్నింగ్స్‌లో అచూతూచీ అడుగులు వేస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా.. తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటున్నారు. బాలీవుడ్‌లో సినిమాలు తగ్గించేశారు. త్వరలో ‘ది ఇండియన్ స్టోరీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో కాజల్ మండోదరి పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక పోడ్‌కాస్ట్ లో పాల్గొన్న కాజల్ హిందీ సినిమాలను ఎందుకు తక్కువగా ఒప్పుకుంటున్నారో వెల్లడించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు దక్కిన నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు బాలీవుడ్‌లో లభించలేదని కాజల్ పేర్కొన్నారు. పనికిరాని రోల్స్‌కు బదులు మంచి నాణ్యత ఉన్న చిత్రాలకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. నటనను ప్రేమించి చేయడానికి భాష ఎప్పుడూ తనకు అడ్డంకి కాలేదని ఆమె స్పష్టం చేశారు.

అలాగే సెట్‌లో క్రమశిక్షణ, సమయపాలన విషయంలో బాలీవుడ్‌లో పద్ధతి లేదని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ సమయంలో తనను చాలా సేపు వేచి చూసేలా చేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో సెట్‌కి వచ్చేవారని, ఆ సమయంలో తాను షూటింగ్ ప్రాంతంలోని జిమ్‌లోనే వర్కౌట్లు చేసుకునేదాన్నని తెలిపారు. సౌత్‌లో ఉండే సమయపాలనకు అలవాటుపడిన తనకు ఇది కాస్త వింతగా అనిపించిందని చెప్పారు. ఇక సినిమాల్లో హీరోయిన్ల పాత్రల గురించి మాట్లాడుతూ.. సౌత్ పరిశ్రమలో ఇప్పుడు మంచి మార్పు వచ్చిందని కాజల్ ప్రశంసించారు. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డు భాగాలనే ఎక్కువగా చూపించడం, వాటిపై పండ్లు విసిరే సన్నివేశాలు చిత్రీకరించడం వంటివి చేసేవారని చెప్పారు. కానీ తాను మొదటినుంచీ అలాంటి సన్నివేశాలకు దూరంగానే ఉంటూ స్పష్టమైన హద్దులు గీసుకున్నానని తెలిపారు. ఇప్పుడు సౌత్‌లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఉండే మంచి కథలను రాస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

Next Story