జింబాబ్వే సిరీస్ కోసం స్పెష‌ల్ ఆఫీస‌ర్..బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం !

by velandi.Saikiran |

జింబాబ్వే సిరీస్ కోసం స్పెష‌ల్ ఆఫీస‌ర్ ను రంగంలోకి దించ‌నుంది బీసీసీఐ.

జింబాబ్వే సిరీస్ కోసం స్పెష‌ల్ ఆఫీస‌ర్..బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా, జింబాబ్వే మధ్య ఎల్లుండి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు వహిస్తున్న కామాఖ్య సైకియాకు కీలక బాధ్యతలు అప్పగించింది. జింబాబ్వేతో టీ20 సిరీస్ ఉన్న నేపథ్యంలో ఉన్నఫలంగా ఇండియా నుంచి అతన్ని హరారేకు పంపించింది. ఈ పర్యటన నేపథ్యంలో భారత క్రికెటర్ల క్రమ శిక్షణ, ప్రయాణాలు, వసతి, ఇతర అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను చూసుకోవాలని సైకియాకు బాధ్యతలు అప్పగించింది.

ఓవరాల్ గా ఈ సిరీస్ కు భారత జట్టు మేనేజర్ గా కామాఖ్య వర్క్ చేయనున్నారు. ఇప్పటికే ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన నేపథ్యంలో అలాంటి తప్పిదాలు జరగకుండా ప్రతిదీ బీసీసీఐ పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగానే, గౌతమ్ గంభీర్ కు ఇప్పటికే రెస్ట్ ఇవ్వగా... వీవీఎస్ లక్ష్మణ్ కు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు సైకియాను బరిలోకి దింపనుంది. సిరీస్ పూర్తయ్యే వరకు టీమిండియా క్రికెటర్ల ప్రదర్శనను కూడా ఈయనే నోట్ చేసుకోబోతున్నారట. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Next Story