ఉక్రెయిన్ పోర్టులో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి.. రష్యా దౌత్యవేత్తకు భారత్ సమన్లు

by Ramesh Naini |

ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు సమీపంలో ‘ఎంవీ గోల్డెన్ లీయో’ అనే వాణిజ్య నౌకపై రష్యా జరిపిన దాడిలో నలుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉక్రెయిన్ పోర్టులో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి.. రష్యా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు సమీపంలో ‘ఎంవీ గోల్డెన్ లీయో’ (MV Golden Leo) అనే వాణిజ్య నౌకపై రష్యా జరిపిన దాడిలో నలుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై విదేశాంగ శాఖ (MEA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు నిరసనగా భారత్‌లోని రష్యా దౌత్యవేత్త వ్లాదిమిర్ లడనోవ్‌కు సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలను బలితీసుకోవడం ఖండించదగిన చర్య అని భారత్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రష్యాకు తేల్చిచెప్పింది.

సముద్ర వాణిజ్యానికి ముప్పు

ఇటువంటి దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత, స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందగా, మరొక భారతీయుడి పరిస్థితి విషమంగా ఉందని MEA ధ్రువీకరించింది. బాధితులకు తగిన సహాయం అందించడానికి ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది.

Next Story