కడుపు నొప్పితో మనస్తాపం.. వ్యక్తి ఆత్మహత్య

by Ratna Kumari |

దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

కడుపు నొప్పితో మనస్తాపం.. వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, తాడ్వాయి : దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన చిట్యాల చిన్న మైసయ్య (45) గత నాలుగేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అనేక ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story