- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్ని సమస్యలు వస్తాయని ఊహించలేదు.. సీఎం సినిమాపై నిర్మాత షాకింగ్ కామెంట్స్
తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్ ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దిశ, సినిమా: తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్ ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కె. నారాయణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘ఈ సినిమా విడుదలకు ముందుగానే కొన్ని ఇబ్బందులు రావొచ్చని మేము అనుకున్నాం. విజయ్ గారు కూడా, "ఇది నా చివరి సినిమా.
దీని తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తున్నాను. అందువల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది" అని ముందే చెప్పారు. అయితే రిలీజ్ సమయంలో థియేటర్స్ విషయంలో కొన్ని అడ్డంకులు రావచ్చని మాత్రమే భావించాం. కానీ మేము ఊహించని కొన్ని పరిస్థితులు వచ్చాయి. జీవితం ఎప్పుడూ ఊహించని మలుపులు తీసుకుంటుంది. జనవరిలో విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు జులై 23కి వచ్చింది. మొత్తంగా చూస్తే రిలీజ్, పైరసీ, కోర్టు వ్యవహారాలు... ఇలా ఇన్ని సమస్యలు ఎదురవుతాయని మేము అసలు ఊహించలేదు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ గారి సినిమా థియేటర్లలో విడుదల కావడం ప్రేక్షకులకు, అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇది ఆయన చివరి సినిమా కాదు.. ముఖ్యమంత్రిగా మొదటి సినిమా’ అంటూ చెప్పుకొచ్చారు.






