- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి అడ్లూరి
ఇటీవల దారుణ హత్యకు గురైన కుటుంబాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పరామర్శించారు.

దిశ, మెట్ పల్లి: మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన కర్రే సునీత ఇటీవల దారుణ హత్యకు గురైన కుటుంబాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంభ సభ్యులను ఓదార్చిన మంత్రి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని మంత్రి తెలిపారు.కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు, మృతురాలి కుమారులు చదువు పూర్తయ్యే వరకు వారి విద్యా బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్తులో వారికి ఉద్యోగ అవకాశాల కల్పనలో కూడా ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ.4,12,500 విలువైన ఆర్థిక సహాయ చెక్కును మంత్రి అందజేశారు. కర్రే సునీత హత్య కేసులో నిందితులు ఎవరైనా,ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని,ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి, సత్యప్రసాద్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అశోక్ కుమార్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్, మెట్‌పల్లి డివిజన్ రెవెన్యూ అధికారి నరసింహ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘ నాయకులు, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.






