ఈనెల 31లోగా రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేయాలి : తహశీల్దార్ ఆదేశం

by Batti.Sumithra |

పేద ప్రజలకు సక్రమంగా బియ్యం అందించాలని బెజ్జూర్ తహశీల్దార్ పి.రామ్మోహన్‌రావు అన్నారు.

ఈనెల 31లోగా రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేయాలి : తహశీల్దార్ ఆదేశం
X

దిశ, బెజ్జూర్ : పేద ప్రజలకు సక్రమంగా బియ్యం అందించాలని బెజ్జూర్ తహశీల్దార్ పి.రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం బెజ్జూర్ తహశీల్ కార్యాలయంలో డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ డీలర్లు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 31లోగా రేషన్ కార్డులకు ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లలు, వృద్ధుల బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ పై ఆరా తీశారు. డీలర్లు నిబంధనల ప్రకారం రేషన్ షాపులను తెరిచి ఉంచాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Next Story