- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ నేను చెప్పిన కథ వద్దని ఆ సినిమా రీమేక్ చేయమన్నారు.. ‘జన నాయగన్’ దర్శకుడు షాకింగ్ కామెంట్స్
భగవంత్ కేసరిలో 50శాతం మాత్రమే ఉంటుందని అన్నారు. ఫస్టాప్‌లో 60శాతం సెకండాఫ్‌లో 20శాతం ఉంటుందని చెప్పారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ ప్రాజెక్ట్ ‘జననాయగన్’. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. మమిత బైజు, ప్రియమణి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సెన్సార్ సమస్యల వల్ల చాలా రోజులే వాయిదా పడిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో అంటే జూలై 23న థియేటర్స్’లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ఈ సినిమా బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై దర్శకుడు హెచ్ వినోద్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. జననాయగన్.. భగవంత్ కేసరికి రీమేక్ అని కాకపోతే పూర్తిగా చేయలేదని అన్నారు. భగవంత్ కేసరిలో 50శాతం మాత్రమే ఉంటుందని అన్నారు. ఫస్టాప్‌లో 60శాతం సెకండాఫ్‌లో 20శాతం ఉంటుందని చెప్పారు. విజయ్ సార్ చివరి మూవీ కోసం తాను మొదట కథ వినిపించానని కానీ ఆ కథ చాలా హేవీగా ఉందని రిజేక్ట్ చేశారని అన్నారు. భగవంత్ కేసరిని రిమేక్ చేయమని తనను అడిగినట్లు వెల్లడించారు.
బాలయ్య యూనివర్స్ విజయ్ శైలికి భిన్నంగా ఉంటుందని తెలిపారు. నేర్కొండ పార్వై తర్వాత మళ్లీ రిమేక్ చేయాలా అనే సందేహాలు తనకు చాలానే ఉండేవని అన్నారు. కానీ విజయ్ చివరి సినిమా కాబట్టి, చాన్స్ వదులుకోవాలని అనుకోలేదని తెలిపారు. అయితే మసం ఎందుకు రీమేక్ సినిమా చేయాలని తాను విజయ్‌ని అడిగానని.. భగవంత్ కేసరి ఎందుకు నచ్చిందో ఆయన తనకు సీన్ బై సీన్ వివరించారని అన్నారు. విజయ్‌కి మహిళా సాధికారత పట్ల ఆసక్తిగా ఉందనిఅన్నారు. ఇది విజయ్ సర్ చివరి సినిమా అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు అయితే భవిష్యత్తులో సీఎం విజయ్ మారి తర్వాత వచ్చే తొలి సినిమాగా మాత్రం దీన్ని చూడొచ్చని అన్నారు. ఇది కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదని.. విజయ్‌ని చూపించడానికే తీసిన సినిమా కాదని సున్నితమైన రాజకీయాల నేపథ్యంలో సాగే కథ అని అన్నారు.






