‘జన నాయగన్’ విజయ్ చివరి మూవీ కాదు.. డైరెక్టర్ ప్ర‌క‌ట‌న‌!

by velandi.Saikiran |

తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన జన నాయగన్ ఈనెల 23వ తేదీన రిలీజ్ కానుంది.

‘జన నాయగన్’ విజయ్ చివరి మూవీ కాదు.. డైరెక్టర్ ప్ర‌క‌ట‌న‌!
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన జన నాయగన్ ఈనెల 23వ తేదీన రిలీజ్ కానుంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రబృందం. ఈ నేపద్యంలో జన నాయగన్ సినిమా దర్శకుడు వినోద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది విజయ్ చివరి సినిమా కాదని.. ఈ విషయం ఎవరికీ కచ్చితంగా తెలియదంటూ బాంబు పేల్చారు. కానీ ముఖ్యమంత్రి విజయ్ సర్ తొలి చిత్రం అని చెప్పొచ్చు అని వెల్లడించారు. ఈ కేవలం కమర్షియల్ సినిమా కాదని.. విజయ్ సర్ ను గొప్పగా చూపించడం కోసం చేయలేదన్నారు. సెన్సిటివ్ పాలిటిక్స్ చుట్టూ కథ నడుస్తుందని వెల్లడించారు. అయితే విజయ్ చివరి సినిమా జన నాయగన్ కాదని దర్శకుడు వినోద్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో కూడా విజయ్ మరో సినిమా చేస్తాడని జోరుగా ప్రచారం కూడా సాగుతోంది.

Next Story