- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం
బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని సైదాబాద్ ప్రధాన రహదారిలోని చాపల మార్కెట్ వద్ద మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సైదాబాద్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

దిశ,చంపాపేట: బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని సైదాబాద్ ప్రధాన రహదారిలోని చాపల మార్కెట్ వద్ద మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సైదాబాద్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు, సాయంత్రం అమ్మవారి వైభవోపేత ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సభ్యులు కాటేకర్ సుభాష్, అవినాష్ నాయుడు, దినేష్ గౌలికర్, ధర్మేందర్ సింగ్ వెల్లడించారు.
అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబం పై ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈ పవిత్ర వేడుకల్లో బస్తీవాసులు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు.






