- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టీఫెన్ ఫ్లెమింగ్ ఔట్..CSK కోసం సిక్సుల వీరుడు ?
స్టీఫెన్ ఫ్లెమింగ్ ఔట్..CSK కొత్త కోచ్ గా మెక్ కల్లమ్ ఛార్జ్ తీసుకుంటాడని టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2027 నేపథ్యంలో ఎలాగైనా టైటిల్ కొట్టాలన్న కసితో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పనిచేస్తోంది. జట్టులో ఉన్న లోపాలను గుర్తించి, మెరుగుపరుచుకునేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా మొన్నటి వరకు ఉన్న హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ను తప్పించింది. అతని స్థానంలో కొత్త కోచ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. ఈ తరుణంలోనే చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ... విదేశీ కోచ్ లను పెట్టాలన్న ఆలోచనతో ఉంది.
ఇందులో భాగంగానే బ్రెండన్ మెక్‌కలమ్ కు అవకాశం ఇవ్వనున్నారట. ఇప్పటికే ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెక్‌కలమ్ తప్పుకున్నాడు. త్వరలోనే వైట్ బాల్ క్రికెట్ నుంచి అతన్ని తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పని చేసేందుకు సిద్ధంగా బ్రెండన్ మెక్‌కలమ్ ఉన్నాడని తెలుస్తోంది. ఈ మేరకు చెన్నై యాజమాన్యంతో కూడా చర్చలు జరిగాయట. అతి త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నా. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.






