- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: బీవీఎం రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, సికింద్రాబాద్: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారతీయ విద్యార్థి మోర్చా (బీవీఎం) రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి రవితేజ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించడంలో జాప్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థుల విద్యాభవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సుమారు 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యను అభ్యసిస్తున్నారని, దాదాపు రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం యాజమాన్యాలకు బకాయిలు చెల్లించకపోవడం, విద్యార్థులు కూడా ఫీజులు భరించలేని పరిస్థితి నెలకొనడంతో అనేక మంది చదువును మధ్యలోనే మానేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం..
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందని, తెలంగాణ సాధన లక్ష్యాలకు ఇది విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే రానున్న రోజుల్లో పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ విద్యార్థి మోర్చా నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలకు సొంత భవనాలు నిర్మించాలని, ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీవీఎం మహిళా నాయకురాలు సరస్వతి, నాయకులు ప్రవీణ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.






