- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీలైనంత త్వరగానే వైభవ్ వికెట్ తీస్తాం..సికందర్ రజా వార్నింగ్
జింబాబ్వే, భారత జట్ల మధ్య ఎల్లు నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సికందర్ రజా కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: జింబాబ్వే, భారత జట్ల మధ్య ఎల్లు నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సికందర్ రజా కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ బ్యాటింగ్ ను మెచ్చుకుంటూ, అతన్ని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దాలని వెల్లడించారు. 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టడం గొప్ప వరమన్నారు. మొన్న మూడు మ్యాచ్ లలో వైభవ్ విఫలం అయ్యాడని అందరూ విమర్శలు చేస్తున్నారు.. కానీ అలా చేయకూడదని కోరారు. 15 ఏళ్ల కుర్రాడికి ఎక్కువగా అవకాశాలు ఇస్తే.. నిలదొక్కుకుంటాడని పేర్కొన్నారు. భారత జట్టులో ఎంతో మంది అనుభవజ్ఞులు అయిన క్రికెటర్లు ఉన్నారు... వాళ్ల మధ్యలో మెదిలితే, వైభవ్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఇక 3 టీ20ల నేపథ్యంలో వైభవ్ ను త్వరగా ఔట్ చేసే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామని కూడా తెలిపారు.
Next Story






