- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసు.. హైకోర్టును ఆశ్రయించిన ఉదయ కృష్ణారెడ్డి
మహిళా ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

దిశ, వెబ్‌డెస్క్: మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి (Udaya Krishna Reddy) తాజాగా తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని (Quash Petition) కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి వాదన తనపై మోపబడిన ఆరోపణలన్నీ అబద్ధాలని, కావాలనే తప్పుడు కేసు బనాయించారని ఉదయ్ కృష్ణారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చట్టంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్న ఆయన, తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరారు. అయితే, ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ధర్మాసనం రేపు ఉందయం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
కాగా, హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా కర్ణాటకకు చెందిన ట్రైనీ మహిళా ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. మోతీనగర్‌లోని బంధువు ఇంటికి వచ్చిన ఉదయ్ హార్పిక్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉదయ కృష్ణారెడ్డి చికిత్స పొందుతున్నాడు.






