కొండాయి జంపన్నవాగుకు భారీ వరద.. నిలిచిపోయిన రాకపోకలు

by Taduka Kalyani |   (  Updated:2026-07-21 09:23:50  IST  )

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి–మల్యాల గ్రామాల మధ్య ప్రవహించే జంపన్నవాగుకు మంగళవారం భారీ వరద పోటెత్తింది.

కొండాయి జంపన్నవాగుకు భారీ వరద.. నిలిచిపోయిన రాకపోకలు
X

దిశ ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి–మల్యాల గ్రామాల మధ్య ప్రవహించే జంపన్నవాగుకు మంగళవారం భారీ వరద పోటెత్తింది. వరద ఉధృతి కారణంగా రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటీవల ప్రజల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రహదారి వరద ప్రవాహానికి తెగిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొండాయి, మల్యాల గ్రామాల మధ్య రవాణా పూర్తిగా స్తంభించింది. వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరూ వాగు దాటేందుకు ప్రయత్నించవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రమాదాలను నివారించేందుకు వాగు పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే తాత్కాలిక రహదారి పునరుద్ధరణతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.


Next Story