- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షూటింగ్‌లో బాలకృష్ట గాయపడటంపై స్పందించిన గోపీచంద్ మలినేని.. షాకింగ్ పోస్ట్ వైరల్
దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా అసలు విషయాన్ని స్పష్టం చేశారు.

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘NBK-111’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ సమయంలో బాలకృష్ణ అనుకోకుండా కాలుజారి కిందపడిపోయారని, దాంతో ఆయన మోకాలికి గాయమైందని వార్తలు బయటకు వచ్చాయి. ప్రమాదాన్ని గమనించిన చిత్రయూనిట్ వెంటనే షూటింగ్ ఆపేసి, చికిత్స కోసం ఆయనను ఆసుపత్రికి తరలించారని వార్తలు వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తలపై స్పందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా అసలు విషయాన్ని స్పష్టం చేశారు. కాకినాడలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ గారికి చిన్న మసిల్ టియర్ అయిందని ఆయన తెలిపారు.
వైద్యుల సూచన మేరకు ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవడం కోసం ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉందని వెల్లడించారు. సినిమా పట్ల బాలయ్యకు ఉన్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం NBK-111 చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. అభిమానులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. మొదట చిన్న గాయమే అనుకున్నప్పటికీ, సర్జరీ అనడంతో బాలయ్య అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా.. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న రెండో మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘NBK-111’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






