బీటెక్ విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణం

by Batti.Sumithra |

బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో జరిగింది.

బీటెక్ విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణం
X

దిశ, గండిపేట : బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే మణికొండలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో నివాసముంటున్న శ్రేయ ఇబ్రహీంబాగ్‌లో ఉన్న వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఇదిలా ఉండగా, విద్యార్థిని కళాశాలలో పరీక్ష రాస్తున్న సమయంలో కాపీయింగ్‌కు పాల్పడినట్లు అధ్యాపకులు మందలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురైన విద్యార్థిని శ్రీరామ్‌నగర్ కాలనీలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా, పోలీసులకు విద్యార్థిని శ్రేయ రాసినట్లుగా భావిస్తున్న ఓ సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. ఉన్నత విద్య అభ్యసిస్తున్న కూతురు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని భావించిన తల్లిదండ్రులు, ఆమె అంతలోనే ఆత్మహత్యకు పాల్పడటంతో గుండెలు బాదుకుంటూ రోదించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Next Story