జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం.. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

by Taduka Kalyani |

భారీ వర్షాలు పడటం వల్ల భూపాలపల్లి సింగరేణిలోని ఓసిపి 2, 3,లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం.. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: భూపాలపల్లి జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలు పడటం వల్ల భూపాలపల్లి సింగరేణిలోని ఓసిపి 2, 3,లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో సింగరేణిలో రోజుకు 6 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నిలిచి పోయింది. గత 15 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పత్తి పంట వేసిన రైతులు పత్తి మొక్కలు ఎండిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు వల్ల రైతు కళ్లల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. మరోవైపు రైతులు యూరియా కాంప్లెక్ ఎరువుల కోసం ఫెర్టిలిజర్ షాపు వద్ద క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం రోజు మీసేవ కేంద్రాల్లో యూరియా కోసం యాప్ వద్దకు వెళ్లగా సర్వర్ పని చేయడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు ఇలానే పడాలని రైతులు కోరుకుంటున్నారు.

Next Story