- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైన్ షాప్‌కి వచ్చిన చిరుత.. ఇద్దరిపై దాడి!
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా తోడరాయ్‌సింగ్ పట్టణంలో సోమవారం ఒక చిరుతపులి తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా తోడరాయ్‌సింగ్ పట్టణంలో సోమవారం ఒక చిరుతపులి తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ఏకంగా ఓ మద్యం దుకాణంలోకి చొరబడి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసింది. ముందుగా మద్యం షాపు బయట నిలబడి ఉన్న ఒక వ్యక్తిపై దాడి చేసిన ఈ చిరుత, క్షణాల్లోనే దుకాణంలోకి దూసుకెళ్లి లోపల ఉన్న సేల్స్‌మెన్‌ను తీవ్రంగా గాయపరిచింది. దీంతో కస్టమర్లు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. గాయపడిన ఇద్దరు బాధితులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసు, అటవీశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జైపూర్ జూ నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ టీమ్ సుమారు 4 నుంచి 5 ఏళ్ల వయసున్న ఆ చిరుతకు మత్తుమందు (ట్రాంక్విలైజర్) ఇచ్చి సురక్షితంగా బంధించారు. మద్యం దుకాణంలోకి చిరుత దూసుకొచ్చిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.






