- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోండి: ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి
ఆర్మూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్, బాల్కొండ, ఆర్మూర్, జక్రాన్ పల్లి మండలాలలోని అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఈనెల 23వ తేదీలోగా చేసుకోవాలని మంగళవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని పద్మ భార్గవి తెలిపారు.

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్, బాల్కొండ, ఆర్మూర్, జక్రాన్ పల్లి మండలాలలోని అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఈనెల 23వ తేదీలోగా చేసుకోవాలని మంగళవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని పద్మ భార్గవి తెలిపారు. నందిపేట్ మండలం బజార్ కొత్తూరు సెంటర్ పరిధిలో షాపూర్ (ఎస్సీ జనరల్ ), తల్వేద(ఈడబ్ల్యూఎస్ జనరల్), బజార్ కొత్తూరు( విహెచ్,) పట్టణంలోని ప్లాట్ల హనుమాన్ గల్లి ( ఎస్టి), మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి, అంకాపూర్.. 3 ( బీసీ ఈ), మెండోరా మండలంలోని సోన్ పేట..1 ( బీసీ.సీ), జక్రాన్ పల్లి మండలంలోని అర్గుల్, మునిపల్లి.. 3 (జనరల్), ఆలూర్ మండలంలోని దేగాం, మచ్చర్ల.. 4 (ఎక్స్ ఎస్/ ఓ సి), డొంకేశ్వర్ మండలం లోని సిర్పూర్..1 (ఎస్టీ) ఇదే మండలంలోని సిర్పూర్, 2 (జనరల్), అంగన్వాడి హెల్పర్ పోస్ట్‌కు జక్రాన్ పల్లి మండలంలోని అర్గుల్ సెంటర్ పరిధిలోని నూర్ సింగ్ టి(ఎస్‌టి) ఈ ఖాళీలైన పోస్టుల భర్తీలకు దరఖాస్తులు చేసుకోవాలని ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని పద్మ భార్గవి తెలిపారు. దరఖాస్తులు చేసుకోదలచిన వారు వారికి సంబంధించిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, రిజర్వేషన్ల ప్రకారం అన్ని సర్టిఫికెట్లతో ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పద్మ భార్గవి సూచించారు.






