- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోడు సమస్యలపై అటవీ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
by Batti.Sumithra |
రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కలిశారు.

X
దిశ, బెజ్జూర్ : రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కలిశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ, పోడు రైతులను అటవీ శాఖ అధికారులు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. గతంలో పట్టాలు ఉన్న రైతుల భూముల్లో కూడా మీ భూములు లాక్కుంటాం అంటూ మొక్కలు నాటుతున్నారని, ఇది అన్యాయమని పేర్కొన్నారు. దీని పై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తక్షణమే స్పందించి, ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు ఫోన్ చేసి పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఆదేశించినట్లు తెలిపారు.
Next Story






