- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్.. ఒకరు మృతి
by Jakkula.Mamatha |
జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, మల్యాల: జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల వైపు కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ఉన్న వ్యక్తి రోడ్డుపై ఎగిరి పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు డీసీఎం వాహనం, ట్రాక్టర్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయట పడినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






