- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ - అమెరికా యుద్ధం.. భారత ఎంబసీ ఎమెర్జెన్సీ అడ్వైజరీ
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో యుద్ధ భయానక పరిస్థితులకు దారి తీస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో యుద్ధ భయానక పరిస్థితులకు దారి తీస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Embassy of India) అక్కడ నివసిస్తున్న, అలాగే ప్రయాణించాలనుకుంటున్న భారతీయ పౌరుల భద్రత దృష్ట్యా అత్యవసర ప్రయాణ హెచ్చరికలను (Emergency Advisory) జారీ చేసింది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రయాణికులు, పర్యాటకులు ఎవరూ కూడా ఇరాన్ దేశానికి వెళ్లవద్దని ఎంబసీ సూచించింది. ముందస్తుగా షెడ్యూల్ చేసుకున్న ప్రయాణ ప్లాన్స్ ఏవైనా ఉంటే, ప్రస్తుతానికి వాటిని పూర్తిగా వాయిదా వేసుకోవడం ఉత్తమమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉద్యోగ, వ్యాపార, ఇతర అవసరాల నిమిత్తం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు ప్రస్తుత భద్రతా పరిస్థితులను సమీక్షించుకోవాలని కోరింది. అక్కడ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోకముందే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కమర్షియల్ ఫ్లైట్స్ ద్వారా వీలైనంత త్వరగా ఇరాన్ దేశాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు లేదా భారతదేశానికి తిరిగి వచ్చేయాలని గట్టిగా సిఫార్సు చేసింది.
అనివార్య కారణాల వల్ల ఇరాన్‌లోనే ఉండిపోవాల్సిన భారతీయ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ హెచ్చరించింది. సైనిక స్థావరాలు, మిలిటరీ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదుని, వాటికి వీలైనంత దూరంగా ఉండాలని తెలిపింది. స్థానిక అంతర్జాతీయ న్యూస్ ఛానళ్లను, తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరుతూ.. అత్యవసర సహాయం కోసం టెహ్రాన్‌లోని భారత ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని, ఎంబసీ అధికారులతో నిరంతరం నిఘాలో ఉండాలని సూచించింది. పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున, భారతీయుల రక్షణే ప్రథమ ప్రాధాన్యతగా భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.






