ఫిఫా WC ఫైనల్స్ : స్పెయిన్ తొలి గోల్

by Muthe.Rajitha |   (  Updated:2026-07-19 22:18:52  IST  )

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతోంది.

ఫిఫా WC ఫైనల్స్ : స్పెయిన్ తొలి గోల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతోంది. స్పెయిన్ జట్టు తొలి గోల్ కొట్టింది. అయితే సెకండాఫ్ ముగిసేవరకు కూడా ఒక్క గోల్ నమోదు కాలేదు. ఫుల్ టైం పూర్తయ్యేసరికి ఇరు జట్లు 0-0 గా నిలిచాయి. కానీ ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ఆటగాడు టోరస్ అద్భుతమైన గోల్ సాధించడంతో.. స్పెయిన్ ముందంజలో ఉంది. కాగా ఈ మ్యాచ్ మొత్తం స్పెయిన్ ఆధిపత్యం చెలాయించింది. అర్జెంటీనా డిఫెన్స్ మోడ్ లో పడిపోయింది. స్పెయిన్ వరుసగా అటాక్ చేయగా.. ఆర్జెంటినా కీపర్ మార్టినెజ్ 10 సార్లు గోల్ అడ్డుకున్నాడు. ఫెర్నాండేజ్ కు రెడ్ కార్డు ఇవ్వడంతో ప్రస్తుతం అర్జెంటీనా 10 మందితోనే ఆడుతోంది. మ్యాచ్ స్పెయిన్ కే అనుకూలంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story