- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ,వెబ్ డెస్క్: భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దారికి వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు తగ్గి మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన యామ్ ఎ తషాకుర్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి చర్చలు జరపాలని అన్నారు. భారత్ పాకిస్థాన్ ఇప్పటి వరకు మూడు యుద్దాలు చేసినా సాధించింది ఏమీ లేదని చెప్పారు. రెండు దేశాలు పీస్‌పుల్ నైబర్స్ మాదిరిగా కూర్చుకుని శాంతి చర్చలు జరపాలని అన్నారు.
దారికి వచ్చిన పాక్ ప్రధాని..శాంతి చర్చలు జరపాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలుకశ్మీర్ అంశంతో పాటూ అన్ని అంశాలను పరిష్కరించుకోవాలని అప్పుడే శాంతి నెలకొంటుందని చెప్పారు. శాంతి నెలకొంటే ఆ తరవాత ఇరు దేశాలు ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో పరస్పరం సహకరించుకోవచ్చన్నారు. ఇదిలా ఉంటే భారత్ సింధూ జలాల అంశంపై, పీఓకే అంశంపై వెనక్కి తగ్గేది లేదని చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు దేశాలు శాంతి చర్చలు జరుపుతాయా..? శాంతి చర్చలు జరిపితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.






