చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

by Jakkula.Mamatha |

చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైన సంఘటన మండలంలో మామిళ్ళపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
X

దిశ, ఉప్పునుంతల: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైన సంఘటన మండలంలో మామిళ్ళపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆవుల తిరుపతయ్య(55) అనే వ్యక్తి ఊర చెరువులో శనివారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి తిరిగి రాలేదని ఆందోళన చెందిన తిరుపతయ్య భార్య చంద్రమ్మ పోలీసులకు పిర్యాదు చెయ్యడంతో ఆదివారం ఉదయం స్థానిక ఎస్సై పుట్ట మహేష్ గౌడ్, ఫైర్ ఎస్సై శంకర్ గౌడ్, సర్పంచ్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Next Story