- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా బోనాల పండుగ వేడుకలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో ఉన్న జోడు కనకదుర్గమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

దిశ, బాన్సువాడ : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో ఉన్న జోడు కనకదుర్గమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ బోనాల ఉత్సవాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురు వినయ్ స్వామి, కృష్ణారెడ్డి, మామిల్ల రాజు, నరసన్నచారి, రవీందర్ రెడ్డి, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






