- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కారేపల్లి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

దిశ, కారేపల్లి : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కారేపల్లి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కామేపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు పూర్తి చేసుకుని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భంగా కారేపల్లి క్రాస్ రోడ్డులో ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఆత్మీయ స్వాగతం అందజేశారు.
ఈ సందర్భంగా వాహనం నుంచి దిగిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు నాయకులు శాలువాలు కప్పి, పూలదండలు వేసి ఘనంగా సన్మానించారు. కొందరు నాయకులు మాట్లాడాలని కోరగా, టేకులపల్లి కార్యక్రమాలకు ఆలస్యమవుతున్నందున మరోసారి కలుద్దామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ఉప ముఖ్యమంత్రి వెంట వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు రామ్‌రెడ్డి గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. స్వాగత కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి, మాజీ ఎంపీపీ దేవ్లా నాయక్, అడ్డగోడ ఐలయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






