కుటుంబంలో ఊహించని విషాదం.. కాలువలోకి దూకి తల్లికుమార్తె ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండలం చొప్పెళ్లకు చెందిన తల్లికుమార్తెలు బూరమ్మ, సూర్యావతి రావులపాలెం మండలం ఊబలంక ముక్తేశ్వర కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు...

కుటుంబంలో ఊహించని విషాదం.. కాలువలోకి దూకి తల్లికుమార్తె ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండలం చొప్పెళ్లకు చెందిన తల్లికుమార్తెలు బూరమ్మ(80), సూర్యావతి(45) రావులపాలెం మండలం ఊబలంక ముక్తేశ్వర కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యావతి మృతదేహం లభ్యంకాగా తల్లి బూరమ్మ కోసం గాలిస్తున్నారు. తల్లికుమార్తె కాలువలో దూకిన వెంటనే స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే కాలువలో కొట్టుకుపోవడంతో కుదరలేదు. వెంటనే స్థానిక పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు.

కుమార్తె మృతి.. తల్లి కోసం గాలింపు

అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రెస్య్కూ బృందాలతో గాలించారు. కుమార్తె సూర్యావతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి, నడివయసులో ఉన్న కుమార్తె ఇద్దరూ కలిసి అంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తులో అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం తల్లి బూరమ్మ మృతదేహం కోసం గజ ఈతగాళ్లు, రెస్య్కూ టీమ్ ముమ్మరంగా కాలువలో గాలిస్తున్నారు.

Next Story