- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్ ATS సెన్సేషనల్ ఆపరేషన్: జైష్-ఎ-మహమ్మద్ ఉగ్ర కుట్ర భగ్నం
గుజరాత్‌లో పాక్ ఉగ్రవాద సంస్థ 'జైష్-ఎ-మహమ్మద్' (JeM) నడిపిస్తున్న ఒక ముఠా గుట్టును యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) రట్టు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మరో ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. నిషేధిత పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ (Jaish-e-Mohammed) నెట్‌వర్క్‌తో సంబంధాలు కొనసాగిస్తూ.. యువతను టెర్రరిజం వైపు నడిపిస్తున్న ఐదుగురు నిందితులను ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఐదుగురిలో భరూచ్‌లోని ఓ మదర్సాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉండటం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నిందితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌ల ద్వారా పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మహమ్మద్ హ్యాండ్లర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భారతదేశంలో విద్వేషాలను రెచ్చగొట్టడం, మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం, యువతను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాద మార్గంలోకి రిక్రూట్ చేసుకోవడమే టార్గెట్‌గా వారు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే, గుజరాత్ రాష్ట్రం భరూచ్‌లోని మదర్సాలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులను కూడా ఈ ఉగ్ర ముఠా బుట్టలో వేసుకుంది. వారికి జిహాదీ భావజాలాన్ని నూరిపోసినట్లుగా దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలు కూడా లభించాయి. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లతో పాటు తీవ్రవాద కరపత్రాలను సీజ్ చేశారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా మరికొందరి కోసం గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయి.






