- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయనగర్ కాలనీ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం..
ఓ అపార్ట్మెంట్‌లోని బెడ్ రూమ్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, కార్వాన్: ఓ అపార్ట్మెంట్‌లోని బెడ్ రూమ్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ మల్లేశం, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ విజయనగర్ కాలనీలో ఫాస్ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో జుబేర్ తన కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు. అయితే శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా బెడ్ రూమ్ లో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా పరుగులు తీసి అపార్ట్మెంట్ కిందకి వచ్చారు.
మంటలు గది మొత్తం వ్యాపించడంతో అపార్ట్‌మెంట్ వాసులు కూడా తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించి వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో సుమారు గంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






