- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూనియర్ కాలేజీ పై నోడల్ ఆఫీసర్ ఆకస్మిక దాడి.. పుస్తకాల గది సీజ్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో తనిఖీలు నిర్వహించారు.

దిశ,అచ్చంపేట రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ జి. వెంకటరమణ పట్టణంలోని న్యూ మాస్టర్ మైండ్స్ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా కళాశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పుస్తకాలను నిల్వ ఉంచిన గదిని అధికారికంగా సీజ్ చేసి తదుపరి చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ జి.వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు ప్రతి ప్రైవేటు జూనియర్ కళాశాల తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
కళాశాల ప్రాంగణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పుస్తకాల విక్రయాలు నిర్వహించరాదని, విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని కళాశాల యాజమాన్యాన్ని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు మళ్లీ చోటుచేసుకుంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, సంబంధిత కళాశాలపై చట్టపరమైన చర్యలు కూడా చేపడతామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ, విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని నోడల్ ఆఫీసర్ సూచించారు.






