ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ఉన్న ఆయుధాలు ఇవే

by Ajay Maddhiboyina |

ఉగ్రదాడులకు ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రస్థావరాలను, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న ఆ దేశ ఆర్మీ ఎయిర్‌బేస్‌లను భారత్ బూడిద చేసింది.

ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ఉన్న ఆయుధాలు ఇవే
X

దిశ‌,వెబ్ డెస్క్: ఉగ్రదాడులకు ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రస్థావరాలను, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న ఆ దేశ ఆర్మీ ఎయిర్‌బేస్‌లను భారత్ బూడిద చేసింది. అయితే ఈ ఆపరేషన్ వెనుక డిఫెన్స్ ఫోర్సులతో పాటూ ఆయుదాలు కూడా కీలక పాత్ర పోశించాయి. భారత్‌లోని కీలక మిస్సైల్స్‌తోనే ఉగ్రస్థావరాలను చిత్తు చేసింది. అవి బ్రహ్మోస్ సూప‌ర్ సోనిక్ క్రూయిజ్ క్షిప‌ణి, సుఖోయ్-30 ఎంకేఐ జెట్‌లు, ఆకాశ్ మరియు బరాక్8 క్షిపణి, S-400 ఆప‌రేష‌న్ సిందూర్‌లో కీలకంగా మారాయి. బ్రహ్మోస్, సుఖోయ్-30 ఎంకేఐ జెట్‌‌లతో పాక్ పై మెరుపుదాడులు చేయగా ఆ దేశ ఆర్మీ చేసిన డ్రోన్ మరియు మిస్సైల్ దాడులను S-400 విజయవంతంగా అడ్డుకుంది. ఒకేసారి ఎన్ని డ్రోన్లు వచ్చిన ఈ క్షిపణి వాటిని నేలమట్టం చేసి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా కాపాడింది. దీంతో ప్రస్తుతం ప్రపంచం అంతా భారత్ ప్రయోగించిన క్షిపణులు గురించి చర్చించుకోవడం మొదలుపెట్టింది.

Next Story