- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకుల విద్యార్థులే తెలంగాణకు భవిష్యత్ బ్రాండ్ అంబాసిడర్లు
గురుకుల విద్యార్థులే తెలంగాణకు భవిష్యత్ బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలోని గురుకులాలు పేద పిల్లల కలలను నిజం చేస్తున్నాయన్నారు.

- పేదింటి పిల్లల కలలను నిజం చేస్తున్న గురుకులాలు
- నీట్ ర్యాంకర్లు, స్వర్ణ పతక విజేతకు సీఎం అభినందనలు
దిశ, తెలంగాణ బ్యూరో : గురుకుల విద్యార్థులే తెలంగాణకు భవిష్యత్ బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలోని గురుకులాలు పేద పిల్లల కలలను నిజం చేస్తున్నాయన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదివి నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు, చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టులో కీలకంగా వ్యవహరించి స్వర్ణ పతకాన్ని సాధించేందుకు కృషి చేసిన సాయి ప్రవళిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం కలిశారు. వారిని సీఎం రేవంత్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. పేదరికం ప్రతిభకు ఎప్పుడూ అడ్డంకి కాదని, సరైన అవకాశం, నాణ్యమైన విద్య, ప్రభుత్వ అండ ఉంటే గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలోనూ సత్తా చాటగలరని పేర్కొన్నారు. గురుకులాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విజయం వెనుక ప్రభుత్వ సంస్కరణలు, సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల విశ్వాసం కలిసి ఉన్నాయన్నారు. ఈ విజయాలు ఒక్క విద్యార్థుల కుటుంబాలకు మాత్రమే కాదు.. తెలంగాణ సమాజానికే గర్వకారణమని పేర్కొన్నారు.






