- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం శ్యామల ఈ ఏడాది మే 31 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె భర్త రాజం ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం జూన్ 3న గ్రీన్ సిటీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించగా, కుటుంబ సభ్యులు దానిని శ్యామలగా గుర్తించారు.
జిల్లా డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో, టౌన్ సీఐ నరహరి ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో జూలై 17న కామారెడ్డి లేబర్ అడ్డా వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిజామాబాద్ జిల్లా శిరాన్‌పల్లికి చెందిన పిట్ట నర్సింలు అలియాస్ నర్సింలును అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో శ్యామలతో వాగ్వాదం జరగడంతో రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌ను రూ.200లకు విక్రయించినట్లు వెల్లడించారు.
అలాగే నిందితుడిపై గతంలో నిజామాబాద్, బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ, హత్య కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రజలు పరిచయం లేని వ్యక్తులతో ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే డయల్-112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.






