- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొంగిపొర్లుతున్న డ్రైనేజీ.. ప్రజల ఇక్కట్లు
నాచారం సర్కిల్లో పొంగుతున్న డ్రైనేజీలతో.. ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.

దిశ, నాచారం : నాచారం సర్కిల్లో పొంగుతున్న డ్రైనేజీలతో.. ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని సూర్య నగర్ కాలనీ, రోడ్డు నెం.7లో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న డ్రైనేజీ గత వారం రోజులుగా పొంగిపొర్లుతోంది. డ్రైనేజీలో ఏర్పడిన అడ్డంకుల కారణంగా మురుగునీరు రోడ్డు పై నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నిల్వ నీటి వల్ల దోమలు విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అలాగే స్థానిక ప్రజలు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా మారి ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. అందువల్ల, దయచేసి సంబంధిత అధికారులను ఆదేశించి డ్రైనేజీలోని అడ్డంకులను తొలగించి, పూర్తిస్థాయిలో శుభ్రపరిచి, మురుగు నీటి ప్రవాహాన్ని సక్రమంగా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన కొరవడింది.




