- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మిక కష్టం ప్రేక్షకులు గుర్తిస్తారు.. ప్రశంసలు కురిపించిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్
by Chukka Sudharani |
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైసా’.
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఓ సాంగ్ కోసం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ వర్క్ చేశారు. ఈ క్రమంలోనే రష్మిక కష్టాన్ని ప్రశంసిస్తూ.. తాజాగా బృందా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘‘మైసా’లో సాంగ్ కోసం పని చెయ్యడం సంతోషంగా ఉంది. ఆ పాట కోసం రష్మిక చేసిన సాధన నిజంగా అద్భుతం. చిత్ర పరిశ్రమలో ఇంత శ్రమపడే, క్రమశిక్షణ, పట్టుదల ఉన్న హీరోయిన్‌ని చూడటం ఇదే తొలిసారి. నేను ఏ కరెక్షన్ ఇచ్చినా.. ఆమె నవ్వుతూ సరిదిద్దుకుంటారు. ఆమెలో ఉండే ఏకాగ్రత, నిబద్ధతే రష్మిక విజయాలకు ప్రధాన కారణం. ఆమె కష్టాన్ని ప్రేక్షకులు తప్పకుండా గుర్తిస్తారు. మైసాలో రష్మిక సృష్టించిన మ్యాజిక్ చూడటం కోసం నేను కూడా వెయిటింగ్’ అంటూ కొనియాడారు.
Next Story






