- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం
ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Alluri Sitarama Raju International Airport) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రాబోయే ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై శనివారం అమరావతిలో ఆయన ఉన్నతాధికారులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగే ఈ ప్రారంభోత్సవ వేడుకను ఒక చారిత్రాత్మక ఘట్టంగా, ఉత్తరాంధ్రా ప్రజలందరూ ఒక పండుగలా జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం ప్రతి అంగుళంలోనూ ఆంధ్రప్రదేశ్ గొప్ప సంస్కృతి, కళలు, గిరిజన సాంప్రదాయాలు, హస్తకళల వైభవం ప్రతిబింబించేలా స్వాగత తోరణాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.






