అమర్‌నాథ్ యాత్ర తాత్కాలిక రద్దు

by Muthe.Rajitha |

హిందువుల అత్యంత పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra 2026)కు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.

అమర్‌నాథ్ యాత్ర తాత్కాలిక రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : హిందువుల అత్యంత పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra 2026)కు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. అమర్‌నాథ్ యాత్ర మార్గంలో ప్రస్తుతం పూర్తి ప్రతికూల పరిస్థితులు ఉండటం వల్ల జమ్మూ కాశ్మీర్ పోలీస్ యంత్రాంగం, శ్రైన్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హిమాలయాల్లో ఒక్కసారిగా మారిన ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు వెల్లడించాయి. అమర్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, మంచు కొండల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండటంతో.. జూలై 19 (ఆదివారం) నుండి యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తుల భద్రత దృష్ట్యా బాల్‌టాల్, పహల్‌గామ్ బేస్ క్యాంపుల నుంచి ఎవరినీ ముందుకు వెళ్లకుండా నిలిపివేశారు. వాతావరణం అనుకూలించి, మార్గాలు సురక్షితంగా మారిన తర్వాతే యాత్రికులను అనుమతిస్తామని యంత్రాంగం స్పష్టం చేసింది. కాగా భద్రతా కారణాల రీత్యా ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రా మార్గాల్లో గగనతల రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించారు. పహల్‌గామ్ (Pahalgam), బాల్‌టాల్ (Baltal) రూట్లను "నో-ఫ్లై జోన్" (No-Fly Zone) గా కేంద్ర రక్షణ శాఖ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై 3న ప్రారంభం అయిన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 28 తో ముగియనుండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో తాత్కాలికంగా యాత్రను నిలిపివేశారు.

Next Story