- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ.. రెబల్స్ శిండే వర్గంలో విలీనం
శివసేన (UBT) పార్టీకి చెందిన ఆరుగురు రెబల్ ఎంపీలు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని 'శివసేన' పార్టీలో విలీనం కావడానికి స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ఆమోదం తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : శివసేన (UBT) పార్టీకి చెందిన ఆరుగురు రెబల్ ఎంపీలు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని 'శివసేన' పార్టీలో విలీనం కావడానికి స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ఆమోదం తెలిపారు. రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-Defection Law) ప్రకారం.. అనర్హత వేటు పడకుండా ఉండేందుకు అవసరమైన సంఖ్యాబలం (రెండు వంతుల మెజారిటీ) ఈ రెబల్ గ్రూపునకు ఉండటంతోనే స్పీకర్ ఈ విలీనాన్ని చట్టబద్ధంగా ఆమోదించారు. ఈ ఆరుగురు ఎంపీల చేరికతో లోక్‌సభలో శిండే నేతృత్వంలోని శివసేన బలం 7 నుండి ఒక్కసారిగా 13 కి చేరింది. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే పక్షం కేవలం ముగ్గురు ఎంపీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
టీఎంసీ చీలిక వర్గానికి సభలో ప్రత్యేక సీట్లు
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో తిరుగుబాటు చేసిన 20 మంది రెబల్ ఎంపీలకు సంబంధించి స్పీకర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ 20 మంది ఎంపీలు సభలో అసలైన టీఎంసీ వర్గం వైపు బెంచీల్లో కాకుండా, విడిగా కూర్చునేందుకు స్పీకర్ అనుమతించారు. ఈ మేరకు వారికి సభలో ప్రత్యేకంగా సీట్లను కేటాయించారు. తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచిన ఈ 20 మంది ఎంపీలు తాము "నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా" (NCPI) లో చేరినట్లు ఇటీవల ప్రకటించారు. అయితే, వీరు అధికారికంగా ఆ పార్టీలో విలీనమవడాన్ని స్పీకర్ ఆమోదించారా లేదా అనే విషయంపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం వీరు సభలో ప్రత్యేక గ్రూపుగా వ్యవహరించనున్నారు.






