- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీ, గంభీర్‌ల మధ్య విభేదాల్లేవు : భారత కోచ్
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కొటక్ తెలిపాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కొటక్ తెలిపాడు. వారిద్దరూ మాట్లాడుకుంటారని, పని విషయంలో వారి మధ్య ఎలాంటి సమస్య లేదన్నాడు. ‘ఈ రోజు విరాట్, గౌతమ్ 10 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. వారి మధ్య వారధిగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. పుకార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదు. కానీ వస్తున్నాయి.’అని కొటక్ చెప్పాడు. ఈ సందర్భంగా ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ, తనకు మధ్య డిస్కషన్‌ను వివరించాడు. ‘అతను బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. నిజాయతీగా చెప్పాలంటే ఒక బ్యాటింగ్ కోచ్‌గా అతని బ్యాటింగ్‌లో ఏదైనా పెద్ద లోపం కనిపిస్తే తప్ప అతని బ్యాటింగ్‌కు కలిగించకూడదు. కానీ, తన ఫుట్‌వర్క్ గురించి అతను కొన్ని విషయాలు నన్ను అడిగాడు. నెట్స్ తర్వాత కూడా అతను నాతో మాట్లాడుతూనే ఉన్నాడు.’అని తెలిపాడు. కోహ్లీ, గంభీర్‌కు పడటం లేదని కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. టెస్టు క్రికెట్‌కు కోహ్లీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రచారం ఇంకా ఎక్కువైంది.






