- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుది దశకు చేరుకున్న మాధవన్ లెగసీ!...రిలీజ్ ఎప్పుడంటే?
by Chukka Sudharani |
తమిళ హీరో మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సిరీస్ ‘లెగసీ’.
దిశ, సినిమా: తమిళ హీరో మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సిరీస్ ‘లెగసీ’. నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు చారుకేశ్ శేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో మాధవన్ 'పెరియవర్' అనే వృద్ధాప్య గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. తన సామ్రాజ్యాన్ని, కుటుంబాన్ని, వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన చేసే పోరాటం ఈ సిరీస్ కథాంశం. ఈ సిరీస్‌లో మాధవన్‌తో పాటు నిమిషా సజయన్, అభిషేక్ బెనర్జీ, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధాన తారాగణంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా టీమ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుందని తెలుస్తుండగా.. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయట. దీంతో ఈ ఏడాది చివరలో మూవీని విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తుండగా.. త్వరలో అప్డేట్ ఇవ్వనున్నట్లు టాక్.
Next Story






