- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు రోజులుగా అదృశ్యం.. క్వారీలో మృతదేహంగా లభ్యం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని పిఎన్ లక్ష్మాపూర్ గ్రామంలో మూడు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి క్వారీలో మృతదేహంగా లభ్యమైన ఘటన విషాదాన్ని నింపింది.

దిశ, అచ్చంపేట రూరల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని పిఎన్ లక్ష్మాపూర్ గ్రామంలో మూడు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి క్వారీలో మృతదేహంగా లభ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. పోలీసులు చాకచక్యంగా ఆనవాళ్ల ఆధారంగా మృతుడిని గుర్తించి, చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు వరిగె బాలస్వామి (47)గా గుర్తించారు. బాలస్వామికి ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామ శివారులోని క్వారీలో మృతదేహం పడి ఉన్నట్లు పొలాలకు వెళ్లిన గ్రామస్థులు గమనించారు.
క్వారీ ప్రాంతం నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వ్యక్తం చేసిన గ్రామస్థులు వెంటనే అచ్చంపేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అచ్చంపేట ఎస్సై నరేష్ ఆధ్వర్యంలోని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం పై ఉన్న ఆనవాళ్లను పరిశీలించగా, మూడు రోజుల క్రితం నమోదైన అదృశ్య ఫిర్యాదులో పేర్కొన్న వివరాలతో పోలికలు కనిపించాయి.దీంతో కుటుంబ సభ్యులను సంఘటన స్థలానికి పిలిపించి గుర్తింపు చేపట్టగా, మృతదేహం బాలస్వామిదేనని వారు నిర్ధారించారు. అనంతరం పంచనామా, ఇతర చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అచ్చంపేట ఎస్సై నరేష్ తెలిపారు.






