- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విలేకరి పై అక్రమ ఇసుక మాఫియా దాడి..
by Batti.Sumithra |
నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అధికార పార్టీ అండదండలతో కృష్ణానదిలో ఇసుక దందా చేస్తున్నారు.

X
దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అధికార పార్టీ అండదండలతో కృష్ణానదిలో ఇసుక దందా చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో వార్తలు కవరేజ్ చేయడానికి వెళ్ళిన ఓ పత్రికకు సంబంధించిన మాగనూరు విలేకరి రాము పై కృష్ణ మండలం గుడెబల్లూరు సమీపంలోని కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియా అడ్డుకొని దాడికి దిగారు. ఓ పార్టీకి చెందిన నేత, మరి కొంతమంది అనుచరులు కలిసి ఈ దాడికి పాల్పడ్డారు. ప్రతిరోజు కృష్ణానది నుంచి వందల టిప్పర్లతో సరిహద్దులు దాటిస్తున్నారు. ఇది అక్రమమని తెలిసినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతలు అండదండలతో జోరుగా ఇసుక దందానడుస్తుందని అంటున్నారు. రిపోర్టర్ల పై దాడికి దిగిన వారి పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






