- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిప్పర్ లారీ ఢీకొని పాఠశాల విద్యార్థి దుర్మరణం
పాఠశాలకు వెళ్లి విద్యాబుద్ధులు నేర్చుకుని.. ప్రయోజకుడై కుటుంబానికి బాసటగా నిలుస్తాడనుకుంటే.. అంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో విద్యార్ధిని మృత్యువు కబలించింది.

దిశ, జవహర్ నగర్ : పాఠశాలకు వెళ్లి విద్యాబుద్ధులు నేర్చుకుని.. ప్రయోజకుడై కుటుంబానికి బాసటగా నిలుస్తాడనుకుంటే.. అంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో విద్యార్ధిని మృత్యువు కబలించింది. మమ్మి.. డాడి పాఠశాలకు వెళ్తున్నానని చెప్పిన మాటలే.. ఆ తల్లిదండ్రులకు చివరి మాటలుగా మిగిలిపోయాయి. ద్విచక్ర వాహనం పై అన్నతో కలిసి పాఠశాలకు వెళ్తుండగా.. టిప్పల్ లారీ అతి వేగంగా దూసుకువచ్చి వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఓ విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కాప్రా మండల పరిధి సాయిబాబానగర్ కాలనీలో మహ్మద్ సిరాజ్, భార్య, కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు.
చిన్నకుమారుడైన మహ్మద్ సుఫియాన్ (13) సెయింట్ అంథోని గ్రామర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు సుఫియాన్ ను వదిలిపెట్టేందుకు ద్విచక్రవాహనం పై పెద్దకుమారుడితో కలిసి వెళ్ళగా దమ్మాయిగూడ పెట్రోల్ బంక్ సమీపంలోని ప్రధాన రహదారి పై వెనుక నుంచి అతి వేగంగా దూసుకువచ్చిన టిప్పల్ లారీ ఢీ కొట్టడంతో లారీ వెనుక చక్రాల కింద పడి సుఫియాన్ అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. పెద్ద కుమారుడికి స్వల్ప గాయాలు కాగా దవాఖానాకు తరలించారు. విద్యార్థి సుఫియాన్ మృతితో దమ్మాయిగూడ పాఠశాలలో, సాయిబాబానగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






