- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను కాదని ఇతర పార్టీల నుండి ప్రభుత్వం రాకముందు, వచ్చిన తరవాత వచ్చినవాళ్లకు పెద్దపీట వేసి పార్టీలో ఉన్నవాళ్లను అవమానించడం కరెక్ట్ కాదన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను కాదని ఇతర పార్టీల నుండి ప్రభుత్వం రాకముందు, వచ్చిన తరవాత వచ్చినవాళ్లకు పెద్దపీట వేసి పార్టీలో ఉన్నవాళ్లను అవమానించడం కరెక్ట్ కాదన్నారు. ఈరోజు పార్టీలోకి వచ్చినవాళ్లు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో ఉంటారనే గ్యారెంటీ లేదని అన్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందని ఉన్నారని, రేపు అధికారం కోల్పోతే వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. నకిరేకల్, తుంగతుర్తి లాంటి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్లకు టిక్కెట్లు ఇచ్చినా, కాంగ్రెస్ కార్యకర్తలు అధికారం కోసం సొంత డబ్బులు ఖర్చు చేసుకుని మరీ గెలిపించారని అన్నారు. కానీ ఇప్పుడు వాళ్లు గెలిచి అదే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.






