కృష్ణపట్నం పోర్టులో ప్రమాదం.. సముద్రంలోకి క్రూడాయిల్ లీక్

by Ramesh Naini |

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. పోర్టు లోని రెండో నంబర్ బెర్త్ వద్ద పైపులైన్ పగిలిపోవడంతో పెద్ద మొత్తంలో క్రూడాయిల్ సముద్రంలోకి లీకైంది.

కృష్ణపట్నం పోర్టులో ప్రమాదం.. సముద్రంలోకి క్రూడాయిల్ లీక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. పోర్టు లోని రెండో నంబర్ బెర్త్ వద్ద పైపులైన్ పగిలిపోవడంతో పెద్ద మొత్తంలో క్రూడాయిల్ సముద్రంలోకి లీకైంది. ఈ ఘటనతో పోర్టు పరిసరాల్లో కలకలం నెలకొంది.

నిర్వహణ లోపమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రూడాయిల్ వృథా కావడంతో పాటు సముద్రంలోకి లీక్ కావడంపై పోర్టు యాజమాన్యం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో కాంట్రాక్టర్లు, పోర్టు అధికారులు, సిబ్బంది పాత్రపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు, నష్టంపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Next Story