- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గట్టు: గుప్తనిధుల్లో మిగిలిన నాణేలు స్వాధీనం
మండల కేంద్రంలో నాణేలు దొరికిన కూలీల ఇళ్లకు వెళ్లి 21 వెండి నాణేలు, కొంత బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ టంగుటూరి శ్రీనివాస్, ఎస్‌ఐ శేఖర్ గౌడ్ తెలిపారు.

దిశ, గట్టు : మండల కేంద్రంలో నాణేలు దొరికిన కూలీల ఇళ్లకు వెళ్లి 21 వెండి నాణేలు, కొంత బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ టంగుటూరి శ్రీనివాస్, ఎస్‌ఐ శేఖర్ గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో శ్యాంసుందర్ జోషి నివాసంలో లభించిన వెండి నాణేల్లో కూలీలు కొన్ని మాత్రమే అప్పగించి, మిగిలినవి తమ వద్ద ఉంచుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం సీఐ టంగుటూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గట్టులోని వారి నివాసాలకు వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శేఖర్ గౌడ్ చెప్పారు. జిమ్మేస్ వద్ద నుంచి 10 వెండి నాణేలు, ఒక బంగారం ముక్క, రాముడు వద్ద నుంచి 9 వెండి నాణేలు, ఒక బంగారు ఉంగరాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు. అలాగే బజారి వద్ద ఉన్న ఒక వెండి నాణెం, రాముడు వద్ద ఉన్న మరో వెండి నాణెాన్ని ఎస్. కృష్ణకు ఇచ్చినట్లు తెలియడంతో, ఆ రెండు నాణేలను కూడా ఎస్. కృష్ణ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మిగతా నాణేలతో పాటు ఇతర గుప్తనిధుల అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్‌ఐ శేఖర్ గౌడ్ తెలిపారు.






