- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనంతో వెల్లివిరిసిన మానవత్వం
కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతున్న పేదింటి మహిళకు దాతలు అండగా నిలిచారు.

దిశ, మాడ్గులపల్లి : కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతున్న పేదింటి మహిళకు దాతలు అండగా నిలిచారు. "పేదింటి ఆడబిడ్డకు పెద్ద కష్టం... అప్పన్న హస్తం కోసం ఎదురుచూపు" అనే శీర్షికతో దిశ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన దాతలు రూ.1.20 లక్షలు అందించి మానవత్వాన్ని చాటారు. దిశ ప్రతినిధితో పాటు తోపుచర్ల గ్రామానికి చెందిన భీమ్ సోల్జర్స్ ఫౌండేషన్ సభ్యులు, సోషల్ మీడియా వారియర్స్ ఈ కథనాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో పలువురు దాతలు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా పాల్వాయి సైదమ్మ చికిత్స కోసం తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. దాతల నుంచి సేకరించిన రూ.1.20 లక్షలను శనివారం భీమ్ సోల్జర్స్ ఫౌండేషన్, తోపుచర్ల సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో పాల్వాయి సైదమ్మకు అందజేశారు.
ఈ సందర్భంగా భీమ్ సోల్జర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు వల్లపుదాసు ప్రణవ్ మాట్లాడుతూ.. ఆపద సమయంలో చేయూతనిచ్చిన దాతల దాతృత్వం అభినందనీయమని అన్నారు. దిశ దినపత్రిక కథనం, సోషల్ మీడియా ప్రచారం ద్వారా స్పందించి సైదమ్మకు సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో గ్రామంలో ఎవరికైనా ఆపద వచ్చినా భీమ్ సోల్జర్స్ ఫౌండేషన్, సోషల్ మీడియా వారియర్స్ ముందుండి సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన దాతలకు, సహకరించిన దిశ ప్రతినిధులకు, భీమ్ సోల్జర్స్ ఫౌండేషన్ సభ్యులకు పాల్వాయి సైదమ్మ–వెంకన్న కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భీమ్ సోల్జర్స్ ఫౌండేషన్ సభ్యులు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు.






